ఆ దేశానికి వెళ్లాలనుకునే భారతీయులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ దేశానికి వెళితే మిమ్మల్ని రక్షించడం మావల్ల కాదు అని వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ ఆ దేశం ఏంటో తెలుసా …….. కెనడా . అవును కెనడా కు ఉద్యోగ నిమిత్తం అలాగే ఉన్నత చదువుల నిమిత్తం వెళ్లాలనుకుంటున్న వాళ్ళు మరోసారి ఆలోచించాలని హెచ్చరించింది. భారత ప్రభుత్వం ఇలా హెచ్చరించడానికి కారణం ఏంటో తెలుసా ……
కెనడాలో గతకొంత కాలంగా భారతీయులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు దాడులకు పాల్పడిన వాళ్ళను ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు కెనడా ప్రభుత్వం. దాంతో భారత్ తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చింది. అంతేకాదు పంజాబ్ ని ఖలిస్థాన్ గా మార్చి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని కెనడాలో కొంతమంది సిక్కులు కోరుతుంటే వాళ్లకు కెనడా ప్రభుత్వం అండగా ఉండటం ఏంటి ? అని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది మోడీ సర్కారు. ఈదశలోనే భారత్ నుండి కెనడా వెళ్లాలని చూసేవాళ్ళు వెళ్లకుండా ఉంటేనే మంచిదని , ఒకవేళ వెళితే మేము మిమ్మల్ని కాపాడలేమని అంటోంది.