అమెరికాలో కారు ప్రమాదం చోటు చేసుకోగా ఆ ప్రమాదంలో భారతీయ కుటుంబం బలి అయ్యింది. ఈ విషాదకర సంఘటన అమెరికాలోని కెంటుకీ లో జరిగింది. కారు ప్రమాదంలో జితు గలానీ , నీతూ గలానీ , నాలుగేళ్ళ కుమారుడు అక్కడికక్కడే మరణించగా 11 ఏళ్ల బాలుడు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు దాంతో అతడ్ని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.
సంఘటన వివరాలలోకి వెళితే …….. కార్టర్ కేవ్స్ స్టేట్ రిసార్ట్ పార్క్ లో క్యాంప్ వేయాలని జీతు గలానీ – నీతూ గలానీ కుటుంబం భావించింది. దాంతో తమ ఇద్దరు పిల్లలతో కలిసి రిసార్ట్ పార్క్ కు తమ కారులో కెంటుకీ బయలుదేరారు. పార్క్ ఎంట్రన్స్ వరకు క్షేమంగానే వెళ్లారు. అయితే ఎంట్రన్స్ దగ్గరకు రాగానే కారు వేగాన్ని అదుపు చేయడంలో విఫలమయ్యాడు జీతు గలానీ దాంతో భారీ యాక్సిడెంట్ అయ్యింది.
యాక్సిడెంట్ వల్ల కారు పల్టీలు కొట్టడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయారు జీతు గలానీ – నీతూ గలానీ దంపతులు. వాళ్లతో పాటుగా నాలుగేళ్ళ కుమారుడు కూడా స్పాట్ లోనే చనిపోయాడు. అయితే లక్కీగా 11 ఏళ్ల బాలుడు మాత్రం గాయాలతో బయటపడ్డాడు. దాంతో ఆ బాలుడ్ని ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కాలంలో అమెరికాలో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాగా వాటిలో ఎక్కువగా భారతీయులు చనిపోతున్నారు.