చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తన పదవికి రాజీనామా చేసాడు అనే వార్త వైరల్ గా మారింది. కరోనా కట్టడి విషయంలో అలాగే దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడమే జిన్ పింగ్ రాజీనామాకు కారణమని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు ఊహాగానాలు మాత్రమే ! ఇప్పటికైతే జిన్ పింగ్ రాజీనామా చేయలేదు కానీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో మాత్రం జిన్ పింగ్ పై తీవ్ర అసంతృప్తితో ఉందట.
త్వరలోనే జిన్ పింగ్ ని రాజీనామా చేయాలనీ ఆదేశించడం ఖాయమని , జిన్ పింగ్ స్థానంలో చైనా ప్రధానిగా లీ కెకియాంగ్ ని నియమించనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కరోనా ఫోర్త్ వేవ్ లో పాజిటివ్ అని తేలితే వాళ్ళ పట్ల జిన్ పింగ్ కఠిన చర్యలు తీసుకుంటున్నాడు. దాంతో చైనీయులు జిన్ పింగ్ వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.