యూఎస్ లో ద్రవ్యోల్బణం తీవ్రమైంది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అగ్రరాజ్యం అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇక డోజోన్స్ కూడా భారీ ఎత్తున నష్టపోయింది. డోజోన్స్ ఇండస్ట్రియల్ ఏవరేజ్ 900 పాయింట్లు పతనం కాగా ఎస్ అండ్ పీ -500 నాస్ డాక్ భారీ ఎత్తున నష్టపోయాయి. ఆర్ధిక వేత్తల అంచనాలను మించి అమెరికాలో ఆగస్టు ద్రవ్యోల్బణం 8.3 శాతానికి పెరిగిపోయింది.
ద్రవ్యోల్బణం ను అదుపులోకి తీసుకురావడానికి వడ్డీ రేట్లను పెంచక తప్పదని భావిస్తున్నారు ఆర్థికవేత్తలు. అమెరికా ఆర్ధిక వ్యవస్థకు పెను సవాల్ గా నిలిచిందని , ఆర్ధిక మాంద్యం తలెత్తకుండా పలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు.