ఉత్తర కొరియాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఒక్క రోజులోనే దేశ వ్యాప్తంగా 1,74,440 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అంతేకాదు కరోనా తో 21 మంది చనిపోయారు కూడా. కరోనా మహమ్మారిని తమ దేశంలోకి రానిచ్చేది లేదంటూ యుద్ధమే ప్రకటించాడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్. ఒక్క కరోనా కేసు రాగానే లాక్ డౌన్ ప్రకటించాడు. కట్ చేస్తే నిన్న ఒక్క రోజే దాదాపు 2 లక్షల కేసులు నమోదు కావడంతో అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడట. కరోనా తమ దేశంలోకి రాకుండా కిమ్ పలు జాగ్రత్తలు తీసుకున్నాడు పాపం. కానీ లాభం లేకపోయింది. వారం రోజుల క్రితం ఒక్క కేసు నమోదు కాగా వారం తర్వాత చూస్తే 1,74, 440 కరోనా కేసులు తేలడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు.
Breaking News