కరోనా మహమ్మారి ఉత్తర కొరియాని వణికిస్తోంది. కేవలం 10 రోజుల్లోనే 8 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో ఆ దేశ ప్రజలు వణికిపోతున్నారు. 10 రోజుల కిందట ఒక్క కరోనా కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ తక్షణమే స్పందించి లాక్ డౌన్ ప్రకటించాడు.
ఒక్క కరోనా కేసు నమోదుకే ఇంత హడావుడి అవసరమా అని అంతర్జాతీయంగా పలు విమర్శలు తలెత్తాయి. అయితే కిమ్ ఎందుకు ఆ పని చేసాడో ఇప్పుడు ప్రపంచానికి అర్ధం అవుతోంది. వారం , పది రోజుల్లోనే 8 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు 42 మంది కరోనాతో మరణించారు కూడా. రాబోయే రోజుల్లో ఈకేసులు మరింతగా పెరిగేలా ఉన్నాయని భావిస్తున్నారు.