తానా ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరుగనున్నాయి. ఈ క్రికెట్ పోటీలు మే 28 , 29 , మరియు 30 వ తేదీలలో మొత్తం మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. తానా ఏజీ ఫిన్ ట్యాక్స్ క్రికెట్ కప్ -2022 పేరిట ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఇక ఈ పోటీలలో పాల్గొనే జట్లు 250 డాలర్లను ఎంట్రీ ఫీజుగా చెల్లించాలని పోటీలలో విజయం సాధించిన జట్టుకు నగదు బహుమతితో పాటుగా ట్రోఫీని అందజేస్తామని అలాగే రన్నరప్ జట్టుకు కూడా నగదు బహుమతితో పాటుగా ట్రోఫీ అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
Breaking News