చికాగోలో సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టింది ” చికాగో ఆంధ్ర అసోసియేషన్ ” . ప్రముఖ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ బృందం చే ఈ సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమం నవంబర్ 5 న భారీ ఎత్తున జరుగనుంది.
సినీ నేపథ్య గాయకులు ధనుంజయ్ , సాహితీ , వైష్ణవి , రేణు కుమార్ లతో పాటుగా చికాగో గాయకులు మణి తెల్లాప్రగడ, రవించంద్ర తోకల , సౌజన్య , అర్చన తదితరులు తమ గానంతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ కార్యక్రమాలను జయప్రదం చేయడానికి భారీ సన్నాహాలు చేస్తోంది చికాగో ఆంధ్ర సంఘం.