అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. 2024 లో జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇవి సెమీ ఫైనల్ కావడంతో యావత్ ప్రపంచం ఈ మధ్యంతర ఎన్నికల పట్ల ఆసక్తి కనబరుస్తోంది. అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అలాగే డేమోక్రాట్లు హోరాహోరీగా పోరాడుతున్నారు. ఇప్పటికే చెరో 49 స్థానాలను దక్కించుకున్నాయి రిపబ్లిక్ పార్టీ అలాగే డేమోక్రాట్లు.
అయితే అనూహ్యంగా ఆరిజోనా సెనేట్ స్థానాన్ని కైవసం చేసుకుంది డెమోక్రటిక్ పార్టీ. దాంతో బైడెన్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే నెవేడా , జార్జియా స్థానాలు ఎవరు సొంతం చేసుకుంటారు అనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆరిజోనా సెనేటర్ గా మార్క్ కెల్లీ విజయం సాధించాడు. దాంతో నెవేడా , జార్జియా ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.