డెట్రాయిట్ లో తెలుగు సంఘం ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలలో పెద్ద ఎత్తున అక్కడి తెలుగువాళ్లు సంతోషంగా పాల్గొన్నారు. ఈ వేడుకలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే పలువురిని సన్మానించింది డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్. గత 46 సంవత్సరాలుగా విభిన్న కార్యక్రమాలను చేపడుతూ ప్రవాసాంధ్రుల అభ్యున్నతికి పాల్పడుతోంది DTA.