
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( NATS ) ఆధ్వర్యంలోటెక్సాస్ లో వాలీబాల్ టోర్నమెంట్ జరిగింది. సెప్టెంబర్ 3 న జరిగిన ఈ టోర్నమెంట్ లో 35 జట్లు పోటీకి దిగగా అందులో 28 టీమ్ లను మాత్రమే అనుమతించారు. టెక్సాస్ లోని గ్రేప్ వైన్ , ఫీల్డ్ హౌజ్ వేదికగా ఈ టోర్నమెంట్ జరిగింది. నాట్స్ ప్రో కప్ , నాట్స్ అడ్వాన్స్ డ్ కప్ అంటూ రెండు విభాగాలుగా పోటీలు జరిగాయి. ఇక ఈ పోటీలు ముగింపు సమయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి , తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమా మహేశ్వరరావు హాజరయ్యారు. పోటీలలో పాల్గొన్నవాళ్లను అభినందించారు అలాగే పోటీలు నిర్వహించిన నాట్స్ ప్రతినిధులను కూడా అభినందించారు.