మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళను కలుస్తూ వాళ్ళ అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ సాగిస్తున్న అరాచక పాలన నుండి విముక్తి కలిగించడానికి ప్రవాసాంధ్రులు ఎలా పోరాటం చేయాలి……. వాళ్ళ మద్దతు ఏ విధంగా అవసరమో తెలియజేస్తున్నారు.
అమెరికాలో ఉంటున్న తెలుగువాళ్లు తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని కోరుతున్నారు. ఆగస్ట్ 24 నుండి సెప్టెంబర్ 5 వరకు అమెరికాలోని న్యూజెర్సీ, డెట్రాయిట్ , డల్లాస్ , వర్జీనియా తదితర ప్రాంతాల్లో పర్యటించనున్నారు దేవినేని ఉమామహేశ్వరరావు.