మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బోస్టన్ లోని తెలుగు తమ్ముళ్లను కలిశారు. టీడీపీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో బోస్టన్ శాఖ అద్భుతంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ మీద అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్న బోస్టన్ ఎన్నారై శాఖని అభినందించారు మాజీ మంత్రి దేవినేని.
ప్రస్తుతం దేవినేని ఉమామహేశ్వరరావు అమెరికాలో సుడిగాలి పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో తెలుగువాళ్లను కలుస్తూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి పాటుపడేలా చేస్తున్నారు. అందులో భాగంగానే బోస్టన్ ఎన్నారై శాఖను కలిశారు. ఏపీలో మళ్ళీ తెలుగుదేశం పాలన రావడానికి మీవంతు సహాయ సహకారాలను అందించాలని కోరారు దేవినేని. ఇక ఇదే వేదిక పై 85 సంవత్సరాల మహిళకు సన్మానం చేసారు దేవినేని.