అమెరికాలోని డల్లాస్ లో పర్యటించారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. అమెరికా పర్యటనలో ఉన్న దేవినేని అక్కడి తెలుగువాళ్ళతో వరుసగా భేటీ అవుతున్నారు. అందులో భాగంగానే డల్లాస్ లో తెలుగువాళ్ళతో సమావేశమవడానికి డల్లాస్ వెళ్లారు. డల్లాస్ చేరుకున్న దేవినేని ఉమామహేశ్వర రావు కు ప్రవాసాంధ్రులు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం అర్వింగ్ లోని ఓ హోటల్ లో ప్రవాసులతో భేటీ అయ్యారు. తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఏపీలో అధికారంలోకి తీసుకు రావడానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలో చర్చించారు……. అలాగే ప్రవాసాంధ్రుల బాధ్యతని కూడా గుర్తు చేసారు దేవినేని.
Breaking News