చికాగో చేరుకున్నారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. అమెరికా పర్యటనలో ఉన్న దేవినేని అక్కడి ప్రవాసాంధ్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇప్పటికే పలు ప్రాంతాలను చుట్టుముట్టిన దేవినేని తాజాగా చికాగో చేరుకున్నారు. విమానాశ్రయంలో దేవినేనికి స్వాగతం పలికారు పలువురు ప్రవాసాంధ్రులు. చికాగో చేరుకున్న దేవినేని అక్కడ పలువురు ప్రవాసాంధ్రులతో సమావేశమై వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి అన్ని రకాలుగా సహాయాలు చేయాలని కోరారు. అందుకు ప్రవాసాంధ్రులు సహకరిస్తామని మాజీ మంత్రి దేవినేనికి హామీ ఇచ్చారు.
Breaking News