ట్విట్టర్ అధినేత విభిన్న నిర్ణయాలతో సంచలనం సృష్టిస్తున్న ఎలాన్ మస్క్ తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించాడు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్న సమయంలో పలు వివాదాస్పద ట్వీట్ లు చేసాడు. అలాగే అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటికీ , ఆ ఓటమిని ఒప్పుకోకుండా వైట్ హౌజ్ ఖాళీ చేయకుండా రాద్ధాంతం సృష్టించాడు. దాంతో ట్విట్టర్ ట్రంప్ ఖాతాను తొలగించింది.
ఇక అప్పటి నుండి ట్విట్టర్ అంటే మంట డొనాల్డ్ ట్రంప్ కు. కట్ చేస్తే ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేయడంతో తప్పకుండా ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తాడని అనుకున్నారు. అనుకున్నట్లే జరిగింది. ఎలాన్ మస్క్ – ట్రంప్ ల మధ్య మంచి అనుబంధం ఉండటంతో ఎట్టకేలకు ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించాడు.