అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. క్యాపిటల్ హిల్స్ పై దాడి చేయించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్ ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( FBI ) అధికారులు ఫ్లోరిడా లోని ట్రంప్ ఇంటిపై దాడులు నిర్వహించారు. ట్రంప్ ఇంటిలో అమెరికాకు సంబంధించిన పలు రహస్య పత్రాలను FBI అధికారులు కనుకొనడం సంచలనం సృష్టించింది.
అయితే ట్రంప్ మాత్రం బైడెన్ సర్కారు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024 లో మళ్లీ నేను అమెరికా అధ్యక్షుడు గా పోటీ చేయాలని భావిస్తున్న తరుణంలో నన్ను పోటీ నుండి తప్పించేందుకు డెమోక్రాట్లు ఇంతటి దూరగతానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ట్రంప్ వాదన ఒకలా ఉండగా బైడెన్ సర్కారు వాదన మరోలా ఉంది. మొత్తానికి దేశ రహస్య పత్రాలు ట్రంప్ నివాసంలో దొరికాయి కాబట్టి తప్పకుండా ట్రంప్ మెడకు ఇది చుట్టుకునే ప్రమాదం ఉంది.