అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రికార్డ్ ని బద్దలు కొట్టాడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఇంతకుముందు ట్రంప్ తన పరిపాలన కాలంలో 80 మంది భారత సంతతికి చెందిన వాళ్లకు ఉన్నత పదవులను ఇవ్వగా ఇపుడు జో బైడెన్ ఏకంగా 130 మందికి అవకాశం కల్పించాడు. దాంతో అమెరికా చరిత్రలో ఇదొక చరిత్రగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
వైట్ హౌజ్ తో పాటుగా పరిపాలనా రంగంలో మొత్తంగా 130 మందిని భారత సంతతికి చెందిన వాళ్లనే ఉన్నత ఉద్యోగులుగా నియమించారు జో బైడెన్. ఎన్నికల సమయంలో బైడెన్ ఇచ్చిన హామీ మేరకు భారతీయులకు అగ్రస్థానం కల్పించాడు. అమెరికాలో ఒక్క శాతం ఉన్న భారతీయులకు అత్యధికంగా పదవుల పంపకం జరగడంతో పలువురు భారతీయులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు ఉన్న అమెరికా అధ్యక్షులు కూడా భారత సంతతికి ప్రాముఖ్యత ఇచ్చారు.
Breaking News