అమెరికా ప్రెసిడెంట్ గా మళ్ళీ పోటీ చేస్తానని స్పష్టం చేసారు డొనాల్డ్ ట్రంప్. 2016 లో భారతీయులు నాకు అండగా నిలిచారని అందువల్లే ఆ ఎన్నికల్లో విజయం సాధించానని ,అలాగే 2020 లో కూడా భారతీయులు పెద్ద ఎత్తున నాకు మద్దతుగా నిలిచారని ……. ఎక్కువ ఓట్లు నాకే వచ్చినప్పటికీ ఆ ఎన్నికల్లో అక్రమాలు జరగడంతో బైడెన్ గెలిచినట్లుగా ప్రకటించారని సంచలన ఆరోపణలు చేసారు.
2024లో జరుగబోయే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తానని , తప్పకుండా అప్పుడు గెలుస్తానని ధీమా వ్యక్తం చేసారు. గెలిచిన తర్వాత భారత్ తో మరింతగా సన్నిహిత సంబంధాలను నెలకొల్పుతానని అంటున్నారు ట్రంప్. బైడెన్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని దుయ్యబట్టారు ట్రంప్. మోడీ నాకు సన్నిహితుడు కాబట్టి 2024 లో జరుగబోయే ఎన్నికల్లో భారతీయుల మద్దతు కూడా నాకే లభిస్తుందన్న ధీమా వ్యక్తం చేసారు.