అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చిన్న కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ట్రంప్ ఫామ్ హౌజ్ లో ఈ పెళ్లి జరిగింది. అయితే ఈ పెళ్ళికి కేవలం బంధువులు , కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ట్రంప్ పెద్ద కూతురు ఇవాంకా ట్రంప్ కాగా చిన్న కూతురు ” టిఫానీ ట్రంప్ ”. ఈ భామ తన బాయ్ ఫ్రెండ్ అయిన ” మైఖేల్ బౌలస్ ” ను పెళ్లి చేసుకుంది. కొంతకాలంగా ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ ప్రేమకు ట్రంప్ ఆమోదముద్ర వేయడంతో నవంబర్ 13 న ఈ పెళ్లి జరిగింది.
Breaking News