
డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్( DTA ) కొత్త అధ్యక్షుడిగా కిరణ్ దుగ్గిరాల ఎన్నికయ్యారు. 46 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సంస్థ డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్. దాంతో ఇలాంటి గొప్ప సేవా సంస్థకు ప్రెసిడెంట్ గా ఎన్నికడవం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసారు కిరణ్. అలాగే తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేసారు.
తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి , తానా కన్వెన్షన్ కో ఆర్డినేటర్ రవి పొట్లూరి , నరేన్ కొడాలితో పాటుగా డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ పూర్వపు అధ్యక్షులు అలాగే పలువురు ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరి సమక్షంలో డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు కిరణ్ దుగ్గిరాల.