
అగ్రరాజ్యం అమెరికాలో కూడా దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. న్యూజెర్సీలోని ఎడిసన్ లోగల సాయి దత్త పీఠం , శ్రీ శివ విష్ణు టెంపుల్ లో నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. అమ్మవారిని అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నవరాత్రులలో మొదటి రోజు పూజలు ఘనంగా నిర్వహించడమే కాకుండా సంప్రదాయ నృత్యంతో పలువురు అలరించారు. ఈ కార్యక్రమంలో UBlood ఫౌండర్ జై యలమంచిలి, డాక్టర్ శివకుమార్ ఆనంద్ , శంకరమంచి రఘు శర్మ లతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి పూజలో పాల్గొన్నారు.
ఫోటోలు : డాక్టర్ శివకుమార్ ఆనంద్.