శ్రీలంకలో మళ్ళీ ఎమర్జెన్సీ విధించింది అక్కడి ప్రభుత్వం. దాంతో బయట ఎవరైనా కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ అయ్యాయి. శ్రీలంకలో రాజకీయ సంక్షోభం నెలకొనడంతో ఆందోళనకారులు రోడ్లమీదకొచ్చారు. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే అధికార నివాస భవనాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టడంతో కుటుంబంతో సహా మాల్దీవులకు పారిపోయాడు.
ఆందోళన కారుల చర్యతో శ్రీలంక అతలాకుతలం అయ్యింది. దాంతో రెండు రోజుల పాటు వేచి చూసిన శ్రీలంక ఆర్మీ ఆందోళనకారులను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఆందోళన కారులు తక్షణమే అధ్యక్షుడు , ప్రధాని నివాసాలను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేయడమే కాకుండా బయట కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఆందోళన కారులు మాత్రం శ్రీలంక సైన్యం హెచ్చరికలను పెడచెవిన పెడుతున్నారు. ఎక్కడ తగ్గేదే లే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దాంతో శ్రీలంకలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.