అమెరికా న్యూయార్క్ లో ఎమర్జెన్సీ విధించారు. రిపబ్లికన్ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున వలసలు డెమోక్రాట్ రాష్ట్రాలకు వలస వస్తున్నారు. ఇప్పటికే 17 వేలమందికి పైగా న్యూయార్క్ లోకి ప్రవేశించారు. దాంతో వలసలను నివారించడానికి న్యూయార్క్ లో ఎమర్జెన్సీ విధించారు న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ .
సెప్టెంబర్ నుండి ప్రతీ రోజూ 5 నుండి 6 బస్సులలో ప్రజలు వస్తున్నారని , అలా వస్తున్న వాళ్లతో న్యూయార్క్ నగరం నిండిపోతుందని , కావాలంటే డెమోక్రాట్లు ఇలాంటి పనులకు పూనుకుంటున్నారని డెమోక్రాట్ల పై విరుచుకుపడ్డారు న్యూయార్క్ నగర మేయర్. వలస వచ్చేవాళ్లలో చిన్నారులు , అనారోగ్యంతో బాధపడుతున్నవాళ్ళు ఎక్కువగా ఉన్నారని , అలాంటి వాళ్ళను ఆదుకోవాలంటే కనీసం 100 కోట్లు ఖర్చు అవుతుందని , మా ఖజానాలో అంత సొమ్ము లేదని ఆవేదన వ్యక్తం చేసారు.