30.1 C
India
Sunday, April 19, 2026
More

    నాటు నాటు పాట రచయిత చంద్రబోస్ కు ఎన్నారైల ఘన సన్మానం

    Date:

    Tesla car dazzling light show of RRR oscar naatu naatu song
    Tesla car dazzling light show of RRR oscar naatu naatu song

    ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నాటు నాటు అనే పాట రాసి యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన గేయ రచయిత చంద్రబోస్. ఈ పాటకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ఊర మాస్ హీరోలు ఎన్టీఆర్ , చరణ్ అద్భుతమైన డ్యాన్స్ తో మరింత రక్తి కట్టించారు. దాంతో ఆస్కార్ అవార్డ్ వరించింది ఈ పాటను. ఆస్కార్ అవార్డ్ రాకతో ఇప్పుడు ఎక్కడ చూసినా నాటు నాటు పాట మారుమ్రోగుతూనే ఉంది. భారతీయ సినిమాకు అందునా తెలుగు సినిమాకు ఆస్కార్ రావడంతో పలువురు భారతీయులు , అందునా తెలుగువాళ్లు …… మరీ ముఖ్యంగా విదేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులు పరవశించిపోతున్నారు. ఆస్కార్ అవార్డ్ అందుకున్న చంద్రబోస్ ను ఘనంగా సన్మానించాలని భావించిన ఎన్నారైలు న్యూజెర్సీలోని ఎడిసన్ లో భారీ ఎత్తున సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గేయ రచయిత చంద్రబోస్ హాజరయ్యారు. Electrifying Rhythms పేరుతో టెస్లా కార్లతో మార్చి 19 న ఎడిసన్ లో నాటు నాటు సాంగ్ ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. నాటు నాటు అనే పాట బీట్ కు తగ్గట్లుగా అద్భుతమైన లైటింగ్ తో ఈ పాటను ప్రదర్శించారు. టెస్లా కార్లతో మెరుపులకు తగ్గట్లుగా నాటు నాటు సాంగ్ ప్రదర్శన ఎన్నారైలను పరవశింపజేసింది.

    చంద్రబోస్ ను ఘనంగా సన్మానించారు పలువురు ప్రవాసాంధ్రులు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన చంద్రబోస్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికాలో ఉన్న తెలుగువాళ్లు నాకు సన్మానం చేయడం సంతోషంగా ఉందన్నారు చంద్రబోస్. తెలుగు రాష్ట్రలనుండి ఇక్కడకు వచ్చి అగ్రరాజ్యం అమెరికాలో సత్తా చాటుతూ తెలుగువాడి ప్రతిభను యావత్ ప్రపంచానికి చాటిచెబుతున్న మీ అందరికి నా కృతజ్ఞతలు అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నారైలు భాగస్వామ్యం కాగా UBlood app ఫౌండర్ , JSW & Jaiswaraajya.tv సంస్థల శ్రేయోభిలాషి డాక్టర్ జై యలమంచిలి , JSW & Jaiswaraajya.tv సంస్థల గ్లోబల్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ లతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి JSW & Jaiswaraajya.tv నిర్వహణ భాగస్వామి కావడం విశేషం.

    ఫోటోలు : డాక్టర్ శివకుమార్ ఆనంద్.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    New Jersey : న్యూ జెర్సీలోని జైస్వరాజ్య/JSW టీవీ స్టూడియోస్ శ్రావణ సందడి

    New Jersey : తెలుగు వారు ఎక్కడున్నా.. సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు,...

    Keeravani : ప్రపంచ గుర్తింపు.. టాప్ 50 భారతీయుల్లో చంద్రబోస్, కీరవాణి

    Keeravani : ప్రపంచ గుర్తించిన టాప్ 50 భారతీయుల్లో చంద్రబోస్-కీరవాణిలకు చోటు...

    Dr. Peramshetty : మానవీయ విలువలు చాటిన డాక్టర్ పేరంశెట్టిపై కాల్పులు.. మృతి

    Dr. Peramshetty Ramesh Babu : అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు...