అమెరికాలో భారతీయులు సత్తా చాటుతున్నారు. రాజకీయరంగంలో అలాగే వ్యాపారరంగంలో కూడా. తాజాగా అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాగా ఆ ఎన్నికల్లో కాలిఫోర్నియా అసెంబ్లీకి ఎన్నికయ్యింది భారత సంతతికి చెందిన సిక్కు మహిళ డాక్టర్ జస్మీత్ కౌర్ . బేకర్స్ ఫీల్డ్ కు చెందిన జస్మీత్ కౌర్ కరోనా సమయంలో విశిష్ట సేవలు అందించింది. ఆ సమయంలో చేసిన సేవలే కౌర్ ను కాలిఫోర్నియా అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేసాయి. కెర్న్ కౌంటీలోని 35 వ అసెంబ్లీ డిస్ట్రిక్ట్ నుండి పోటీ చేసి విజయం సాధించింది.
జస్మీత్ కౌర్ తల్లిదండ్రులు కొన్నాళ్ల క్రితం భారత్ లోని పంజాబ్ నుండి అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. కౌర్ తండ్రికి కార్ల డీలర్ షిప్ లు ఉన్నాయి దాంతో ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు వ్యాపారంలో తండ్రికి సహాయకారిగా ఉంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికై కాలిఫోర్నియా అసెంబ్లీకి ఎన్నికైన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.