అమెరికాలో వరదలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా కాలిఫోర్నియా రాష్ట్రాన్ని తీవ్ర ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి వరదలు. తుఫాన్ బీభత్సంతో కాలిఫోర్నియా కోలుకోలేని విధంగా దెబ్బతింది. రోడ్ల మీద వరదలు పెద్ద ఎత్తున రావడంతో రోడ్లన్నీ చెరువులు , నదులలా మారాయి. తుఫాన్ భారీ బీభత్సం సృష్టించడంతో ఆ వరదల ధాటికి 19 మంది మరణించగా దాదాపు 15 వేల మంది నిరాశ్రయులయ్యారు. భారీ వరదలు కాలిఫోర్నియా ను ముంచెత్తడంతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు ప్రజలు.
Breaking News