
అగ్ర రాజ్యం అమెరికా పర్యటనలో ఉన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడైన దేవినేని ఉమామహేశ్వరరావు అమెరికాలో ప్రవాసాంధ్రులను కలుస్తున్నారు. అందులో భాగంగానే న్యూజెర్సీలోని ఎడిసన్ లోగల సాయి దత్త పీఠాన్ని సందర్శించారు. దేవినేని రాకతో సాయి దత్త పీఠం కు పలువురు ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శివ విష్ణు టెంపుల్ , సాయి దత్త పీఠంలోని ఆలయాలను దర్శించుకున్నారు దేవినేని.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయి దత్త పీఠం గొప్పతనం గురించి అలాగే సాయి దత్త పీఠంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా వివరించారు ఆలయ చైర్మన్ శంకరమంచి రఘు శర్మ. ఇక ఈ కార్యక్రమంలో JSW, Jaiswaraajya అధినేత కృష్ణమూర్తి యలమంచిలి, ఉపేంద్ర, రమేష్ బాబు యలమంచిలి, JSW , Jaiswaraajya అడ్వైజర్ , UBlood App ఫౌండర్ జగదీష్ యలమంచిలి , JSW, Jaiswaraajya డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ లతో పాటుగా పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు.