
ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని తనపై వస్తున్న విమర్శలను తీవ్ర స్థాయిలో తిప్పికొట్టింది. ఇండోనేషియా లో జరిగిన జీ 20 సమావేశాలకు నేను నా ఆరేళ్ళ కూతురును తీసుకెళ్లానని విమర్శలు చేస్తున్నారు. అలాంటి విమర్శలకు భయపడే రకం కాదని కుండబద్దలు కొట్టింది. ఒకవైపు నా కూతురు యోగ క్షేమాలు చేసుకుంటూనే మరోవైపు ఇటలీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్నాను. ఇలా పని చేయడం నాకు గర్వంగా కూడా ఉందంటూ ఘాటుగానే సమాధానం ఇచ్చింది జార్జియా మెలోని.
ఇటీవల ఇండోనేషియా లో జరిగిన జీ 20 దేశాల శిఖరాగ్ర సమావేశాలకు ఇటలీ ప్రధానిగా జార్జియా కూడా పాల్గొంది. ఇటలీ దేశ చరిత్రలోనే ప్రధాని పదవి చేపట్టిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించింది జార్జియా మెలోని. పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్న జార్జియాను విమర్శించాలని భావించిన కొంతమంది ఇలా దుష్ప్రచారం చేస్తుండటంతో ….. ఇలా వ్యవహరించడం సరికాదంటూ జార్జియా కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.