
అమెరికాలో H- 1B వీసాలతో పనిచేస్తున్న భారతీయులకు అలాగే ఆసియా ఖండానికి చెందిన వాళ్లకు శుభవార్త తెలియజేసింది అమెరికా. H-1B వీసాలతో పని చేస్తున్న వాళ్ళు వీసా గడువు ముగియడంతో మళ్లీ స్వదేశాలకు వెళ్లి స్టాంపింగ్ చేయించుకుని రావాల్సి వస్తోంది. అయితే భారత్ లో అలాగే పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో సైతం స్టాంపింగ్ కు 800 రోజులకు పైగా సమయం పడుతోంది. దాంతో అన్ని రోజుల పాటు భార్యాపిల్లలను వదిలేసి ప్రయాణం చేయడం కష్టంగా మారింది.
దాంతో అమెరికాలో H- 1B వీసాలతో పని చేస్తున్న వాళ్లకు జో బైడెన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. అమెరికాలో పని చేస్తున్న H – 1B వీసాదారులు ఇక స్వదేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బైడెన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. దాంతో అమెరికా లోనే స్టాంపింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించబోతోంది.