ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఇండియన్ టెకీస్ కు శుభవార్త చెప్పనున్నాడట. ఇటీవల ట్విట్టర్ నుండి పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాడు ఎలాన్ మస్క్ . ఇతడి వ్యవహారశైలి నచ్చని దాదాపు 1200 మంది ట్విట్టర్ సిబ్బంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేసారు. దాంతో వాళ్ళ స్థానంలో భారతీయ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ లకు అవకాశం ఇచ్చేలా ప్లాన్ చేస్టున్నాడట ఎలాన్ మస్క్.
ఒకవేళ ఇదే కనుక నిజమైతే భారతీయ టెకీలకు శుభవార్త అనే చెప్పాలి. ఇటీవల కాలంలో ఆర్ధిక మాంద్యం వల్ల ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తోంది. ఇప్పటికే పలువురు భారతీయులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ట్విట్టర్ లో కొత్తగా ఉద్యోగం పొందడం అంటే శుభవార్తే కదా !