
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భారతీయులకు శుభవార్త తెలిపాడు. భారత ప్రధాని నరేంద్ర మోడీ – బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ లు ఇండోనేషియా లోని బాలి లో జరిగిన సమావేశంలో మాట్లాడుకున్న వెంటనే రిషి సునాక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకీ రిషి సునాక్ తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా……. భారతీయులకు ప్రతీ ఏటా 3 వేల వీసాలను మంజూరు చేయాలనే నిర్ణయం. నిజంగా ఇది భారతీయులకు శుభవార్త అనే చెప్పాలి.
రిషి సునాక్ భారత సంతతికి చెందిన వ్యక్తి అనే విషయం తెలిసిందే. దాంతో భారత్ పట్ల తన అభిమానాన్ని ప్రదర్శించారు. అంతేకాదు వచ్చే నెలలోనే భారతీయులకు – బ్రిటన్ వాసులకు ప్రయోజనకరమైన పలు నిర్ణయాలు ప్రకటించనున్నారట. మోడీ – రిషి సునాక్ ల సమావేశం తర్వాత వేగంగా నిర్ణయం తీసుకున్నాడు . దాంతో మోడీ ప్రభావం గురించి మరోసారి చర్చ జరుగుతోంది. బ్రిటన్ కు ఉన్నత చదువుల కోసం వెళ్లాలని భావించే యువతరానికి ఇది గోల్డెన్ చాన్స్ .