అమెరికా న్యూజెర్సీలోని ఎడిసన్ లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుని పూజ కావడంతో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎడిసన్ లోని సాయి దత్త పీఠం శివ విష్ణు టెంపుల్ లో వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో JSW & JaiSwaraajya అధినేత UBlood ఫౌండర్ జగదీష్ యలమంచిలి , సాయి దత్త పీఠం చైర్మన్ రఘు శర్మ , JSW & JaiSwaraajya డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటోలు : డాక్టర్ శివకుమార్ ఆనంద్