27.5 C
India
Tuesday, January 21, 2025
More

    బీజేపీ-యూఎస్ఎ ఆధ్వ‌ర్యంలో గుజ‌రాత్ విజయోత్సవ వేడుక

    Date:

    Gujarat's victory celebration under the auspices of BJP-USA
    Gujarat’s victory celebration under the auspices of BJP-USA

    గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ దక్కించుకొని వరుసగా ఏడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవ‌డంతో ఆ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి. ఇందులో భాగంగా విజయ్ దివస్ సంబరాలను అమెరికాలోని ప‌లు న‌గ‌రాల్లో జ‌రుప‌కున్నారు. ఓవ‌ర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ – యూఎస్ఎ స‌భ్యులు విజయోత్సవ వేడుకను న్యూజెర్సీలో యూఎస్ఎ ప్రెసిడెంట్ అడ‌పా ప్ర‌సాద్, సెక్ర‌ట‌రీ వాసుదేవ్ ప‌టేల్ ఆధ్వ‌ర్యంలో జ‌రుపుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో గుజ‌రాత్ నూత‌న ముఖ్య‌మంత్రి భూపేంద్ర పటేల్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాకు ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌పంచంలోనే అతిపెద్ద పార్టీగా ఎదిగిన‌ బీజేపీ.. గుజ‌రాత్ భారీ విజ‌యంతో తిరుగులేని స్థాయికి చేరుకుంద‌ని కొనియాడారు.

    ఈ సంద‌ర్భంగా ఓవర్ సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ పూర్వ జాతీయ అధ్యక్షులు, కృష్ణ రెడ్డి ఏనుగుల మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో, బీజేపీ గణ విజయంలో, ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ నిర్వహించిన కీలక పాత్రను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఓవర్ సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ నుంచి చాలా కార్యకర్తలు, వాసుదేవ్ పటేల్ ఆధ్వర్యంలో గుజరాత్ వెళ్లి అక్కడ ప్రచారం చేశార‌ని తెలిపారు.

    వాషింగ్టన్ డీసీలో ఓవర్ సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ జాతీయ అధ్యక్షులు అడపా ప్రసాద్ మాట్లాడుతూ.. ఓట్ల సరళి, ఓటింగ్ శాతం పెరిగిన విధానాన్ని వివరించారు, వరసగా ఏడవ సారి గెలవటం నిజముగా గుజరాత్ ప్రజలకు ధన్యవాదములు తెలిపారు. మోదీకి ప్రత్యేక శుభాకాంక్ష‌లు తెలిపారు. ఓవర్ సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ సీనియర్ నాయ‌కులు విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీ లో కూడా బలోపితం అవడానికి అఫ్ బీజేపీ పని చేస్తుంది అన్నారు. తెలంగాణ లో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాడ‌టం ఖాయ‌మ‌న్నారు. గుజరాత్ విజయోస్తవాల్లో పాల్గొన్న ప్రవాస భారతీయులకు, ఎన్నికల్లో విశేషంగా కృషి చేసిన ఓవర్ సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ టీమ్ కి ప్రతేక ధన్యవాదాలు తెలిపారు.

    ఇంకా పలు రాష్ట్రాలలో టంపా (ఫ్లోరిడా), డల్లాస్ , హౌస్టన్ (టెక్సాస్) , కాలిఫోర్నియా, చికాగో లో విజయ్ దివస్ సంబరాలు జరిగాయి. తరువాత, ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ మాజీ అధ్యక్షులు, జయేష్ పటేల్ , సురేష్ జానీ ఎచ్ ఆర్ షాహ, అలాగే సీనియర్ నేతలు అమర్ గోస్వామి , అజయ్ గోస్వామి కల్పన శుక్లా , డాక్టర్ సుధీర్ పారిక్, డాక్టర్ హెచ్ ఆర్ షా , సునీల్ నాయక్ , అరవింద్ పటేల్ (రాజ్ భోగ్) , బాల గురు, ప్రసంగించి ఈ ఎన్నికల విజయాల ప్రాముఖ్యతను తెలిపారు.

    ఈ సంబరాల్లో ఓఎఫ్ బిజెపీ టీం సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, విలాస్ రెడ్డి , హరీ సేతు, దీప్ భట్, సంతోష్ , మధుకర్ , పార్తీబన్, మరియు ఇతర ఓఎఫ్ బిజెపీ నేతలు గుంజన్ మిశ్ర, అమర్ ఉపాధ్యాయ్, రాజేష్ రెడ్డి, ప్రేమ్ కాట్రగడ్డ, మధు అన్న , బసవ శేఖర్, ఇంకా ఇతర సంఘల నాయకులూ పాల్గొన్నారు. అనేక సంఘాల నేతలు, ప‌లువురు ప్రవాస భారతీయులు ఉత్సహంగా పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    Singer Sunitha : సింగర్ సునీతకు బిగ్ షాక్.. భర్త కంపెనీలో ఐటీ సోదాలు

    singer Sunitha : తెలంగాణలో ఉదయం నుంచి ఐటీ అధికారులు హల్ చల్...

    Kiran Abbavaram : తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో

    Hero Kiran Abbavaram :టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి...

    President Trump : వెల్ కం టు హోం ప్రెసిడెంట్ ట్రంప్.. వైరల్ పిక్

    President Trump : అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ దంపతులు గ్రాండ్ గా...

    Saif Ali Khan : తీవ్ర దాడి తర్వాత సైఫ్ అలీఖాన్ మొదటి ఫొటో రిలీజ్.. వైరల్

    Saif Ali Khan : బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Exit polls: బీజేపీకి భారీ షాక్ తగలనుందా..?

    Exit polls: పోలింగ్ ముగిశాక హర్యానా, జమ్ము-కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్...

    Nitin Gadkari : నాలుగోసారి అధికారం కష్టమే..  నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

    Nitin Gadkari : కేంద్ర మంత్రి, సీనియర్ బిజెపి నాయకుడు నితిన్...

    PM Modi : ఎక్కడ ఎలా ఉండాలో బహుషా మోడీకి తెలిసినంతగా ఎవరికి తెలియదు కావచ్చు..

    PM Modi : ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే...