
భారతదేశానికి ఆస్కార్ దక్కలేదు …… ఆర్ ఆర్ ఆర్ వల్లే ఆస్కార్ వచ్చింది అని అనుకుంటున్నారు చాలామంది ……. అయితే ఆర్ ఆర్ ఆర్ కంటే ముందే అందునా ఓ మహిళ రెండుసార్లు ఆస్కార్ ను అందుకుంది. కాకపోతే ఆమె గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. అంతేకాదు మీడియా కూడా ఆమెను అంతగా పట్టించుకోలేదు కూడా. ఇలా తెరమరుగున పడిపోతున్న వాళ్లలో మన దేశానికి చెందిన మహిళ ఉన్నారు …… ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ……… గునీత్ మాంగా.
అవును …… గునీత్ మాంగా అనే మహిళా నిర్మాత ఒకసారి కాదు రెండుసార్లు ఆస్కార్ అవార్డు అందుకుంది. గునీత్ మాంగా అనే పేరు వినగానే ఎక్కడో విన్నట్లు అనిపిస్తోంది కదూ ! అవును ఆమె ……… ”ది ఎలిఫెంట్ విష్పరర్స్” అనే డాక్యుమెంటరీ ఫిలిం తో ఆస్కార్ అందుకున్న నిర్మాత గునీత్ మాంగా. 95 వ అకాడెమీ ఆస్కార్ అవార్డును ”ది ఎలిఫెంట్ విష్పరర్స్” నిర్మించినందుకు అందుకున్న నిర్మాత గునీత్ మాంగా గతంలో ” పీరియడ్ : ఎండ్ ఆఫ్ సెంటన్స్ ” అనే డాక్యుమెంటరీకి 2019 లో మొదటిసారిగా ఆస్కార్ అందుకుంది.
అయితే ఈ విషయం గురించి నేషనల్ మీడియా అలాగే ప్రాంతీయ మీడియా కూడా పెద్దగా ప్రచారం చేయలేదు దాంతో పెద్దగా తెలియలేదు. ఇక ఇప్పుడు కూడా ది ఎలిఫెంట్ విష్పరర్స్ కు ఆస్కార్ అవార్డు వచ్చింది కానీ ఆమెను పెద్దగా ఫోకస్ చేయలేదు. ఎందుకంటే ఆర్ ఆర్ ఆర్ మానియాలో పాపం వీళ్ళ గురించి మీడియా ఎక్కువగా ఫోకస్ చేయలేకపోయింది. దాంతో గునీత్ మాంగా గురించి తెలియలేదు. ఈమె మన భారతీయురాలు కావడం …… రెండుసార్లు ఆస్కార్ సాధించడం గొప్ప విశేషమే మరి.