కెనడాలో భారతీయుడికి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీగా పేరు పొందిన Mc Gill University వైస్ ఛాన్స్ లర్ గా నియమింపబడ్డాడు ప్రొఫెసర్ హెచ్ . దీప్ సైని. ఈ యూనివర్సిటీ కెనడాలో నెంబర్ వన్ స్థానంలో ఉంది.
అలాగే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీ లలో 31 వ స్థానాన్ని ఆక్రమించింది. అలాంటి గొప్ప యూనివర్సిటీకి ఒక భారతీయుడు హెచ్. దీప్ సైని వైస్ ఛాన్స్ లర్ గా నియమించబడటం సంచలనంగా మారింది.
ఈ యూనివర్సిటీలో 10 వేల మందికి పైగా స్టూడెంట్స్ ఉండగా అందులో దాదాపు 27 శాతం మంది భారతీయులు కావడం విశేషం. భారత్ లో పుట్టి పెరిగిన దీప్ సైని లూథియానాలోని పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో బోటనీలో మాస్టర్ డిగ్రీ అందుకున్నాడు.