H1B వీసాల లాటరీ ప్రక్రియ ముగిసింది. హెచ్ 1 బి వీసాల కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంటుందన్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికాలో జెండా పాతాలని , ఉన్నత ఉద్యోగాలు చేయాలని ఆశపడుతుంటారు. అలాంటి వాళ్ళు హెచ్ 1బి వీసా కోసం పెద్ద ఎత్తున అప్లయ్ చేసుకుంటుంటారు. అయితే హెచ్ 1బి వీసాలు పరిమిత సంఖ్యలో జారీ చేస్తుంటుంది అమెరికా. పరిమిత సంఖ్యలో వీసాల మంజూరు ప్రక్రియ జరుగుతుంది కాబట్టి లాటరీ ప్రక్రియ ద్వారా వీసాలను మంజూరు చేస్తారు. 2023 – 24 సంవత్సరానికి గాను 15 నుండి 18 శాతం H1B వీసాలను లాటరీ ద్వారా ఎంపిక చేసారు. దాంతో ఈవీసాల ఎంపిక పూర్తయ్యింది. ఇక రెండోసారి లాటరీ ప్రక్రియ ఈ ఏడాది జులై లో ఉండొచ్చని భావిస్తున్నారు.