2023 సంవత్సరానికి గాను 65వేల హెచ్ 1 బి వీసాలు జారీ చేసేందుకు సరిపడా దరఖాస్తులు అందినట్లు యూఎస్ సీఐఎస్ ( యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ) ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికాలో విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు వీలుగా నాన్ – ఇమ్మి గ్రెన్ట్ విధానంలో ఈ వీసాలను జారీ చేస్తుంది. ఇప్పటివరకూ 65 వేల దరఖాస్తులు అందాయని , వాటికి నోటిఫికేషన్లు కూడా పంపించామని ఎంపిక కాని వాళ్లకు నాన్ – సెలెక్టెడ్ అని మెసేజ్ వస్తుందని , మినహాయింపులు ఉన్న పిటిషన్లను స్వీకరిస్తామని స్పష్టం చేసింది యూఎస్ సీఐఎస్ . అమెరికాలో ఉన్నత ఉద్యోగాల కోసం హెచ్ 1 బి వీసాల కోసం ఎదురు చూసే భారతీయులు కోకొల్లలు కావడం గమనార్హం.
Breaking News