ఉన్నతమైన జీవితం కోసం ప్రయాణం సాగించిన ఓ ప్రవాసాంధ్రుడు తిరిగిరాని లోకాలకు వెళ్ళాడు దాంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన నెక్కలపు హరీష్ చౌదరి (35) విహారయాత్రకు న్యూయార్క్ కు వెళ్ళాడు. అయితే ఆ విహార యాత్ర కాస్త విషాదంగా మారడంతో హరీష్ కుటుంబం తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది. హరీష్ చౌదరి మరణంతో విజయవాడలోని పోరంకి వసంత్ నగర్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఎంటెక్ పూర్తి చేసిన హరీష్ కెనడాలో టూల్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. అయితే విహార యాత్ర కోసం న్యూయార్క్ కు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళాడు. కుటుంబ సభ్యుల ముందే హరీష్ ప్రమాద వశాత్తు మరణించడంతో కన్నీళ్ల పర్యంతమయ్యింది హరీష్ కుటుంబం. ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.