
ప్రపంచ కుబేరుడు, టెస్లా కార్ల అధినేత ఎలాన్ మస్క్ అమ్మను ఎప్పుడైనా చూసారా ? ఆమె పేరు ఏంటో తెలుసా ……. ఎలాన్ మస్క్ తల్లి పేరు ” మేయ్ మస్క్ ”. ఈమె వయసు 74. మస్క్ తల్లి ఒకప్పుడు సూపర్ మోడల్. దాదాపు 50 సంవత్సరాల పాటు మోడల్ గా రాణించింది. వోగ్ , టైమ్ , న్యూయార్క్ టైమ్స్ వంటి పత్రికల కవర్ పేజీ లపై తన అందాలను ఆరబోసింది మేయ్ మస్క్.
ఎలాన్ మస్క్ తల్లి చాలా కష్టాలు పడిందట. ఆమె భర్త చాలా ఇబ్బందులు పెట్టడమే కాకుండా బాగా కొట్టేవాడట. అయితే విడాకులు తీసుకోవాలని అనుకున్నప్పటికీ కుదరలేదు. అయితే చట్టాలు మారడంతో భర్తకు విడాకులు ఇచ్చింది. విడాకులు అయితే ఇచ్చింది కానీ ముగ్గురు పిల్లలను పోషించే స్థోమత లేకపోవడంతో అష్టకష్టాలు పడింది. మొత్తానికి పిల్లలను ప్రయోజకులను చేసింది దాంతో పిల్లలు బాగా చదువుకొని వ్యాపారరంగంలో సంచలనాలు నమోదు చేసారు. ఇప్పుడు ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల్లో ఒకరు కావడం విశేషం.