భర్తను చంపడం ఎలా ? అనే ఆర్టికల్ రాసింది. కట్ చేస్తే కట్టుకున్న భర్తని హత్య చేసింది. అయితే అనూహ్యంగా పోలీసులకు చిక్కింది దాంతో జీవిత ఖైదు విధించింది కోర్టు. ఈ సంచలన సంఘటన అగ్రరాజ్యం అమెరికాలో జరిగింది. సంఘటనా వివరాలలోకి వెళితే ….. అమెరికా పోర్ట్ ల్యాండ్ కు చెందిన నాన్సీ క్రామ్టన్ బ్రోఫీ అనే రచయిత్రి రొమాంటిక్ నవలలు రాస్తుండేది.
అయితే 2018 లో తన భర్తని తుపాకీతో కాల్చి చంపింది. అప్పట్లో ఈ కేసు పెద్ద సంచలనం సృష్టించింది. బ్రోఫీని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. భర్తను చంపక ముందు భర్తను చంపడం ఎలా ? అనే ఆర్టికల్ రాసింది బ్రోఫీ. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది. బ్రోఫీ భర్తతో కలిసి బాగుండేదని , కానీ ఆమె ఎందుకు ఇలా చేసిందో అర్ధం కావడం లేదని అంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు. భర్తని చంపిన బ్రోఫీకి జీవిత ఖైదు విధించింది అమెరికా కోర్టు. దాంతో ఊచలు లెక్కబెడుతోంది బ్రోఫీ.