
అమెరికాను మంచు తుఫాన్ ముంచేసింది. తీవ్రమైన చలిగాలులు , మంచు తుఫాన్ ప్రభావంతో అమెరికా స్తంభించింది. వేలాది విమానాలు రద్దయ్యాయి. ఎక్కడి ప్రయాణీకులు అక్కడే నిలిచిపోయారు……. క్రిస్మస్ వేడుకలకు రంగం సిద్ధం చేసుకున్న వాళ్లకు మంచు తుఫాన్ భయానక వాతావరణాన్ని సృష్టించింది దాంతో 57 మంది మృతి చెందారు.
ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే 27 మంది మంచు తుఫాన్ వల్ల మరణించగా అమెరికా వ్యాప్తంగా 57 మంది మరణించారు. ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మంచు తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో హైవేలు కూడా మూసుకుపోయాయి. అలాగే కరెంట్ కష్టాలు అమెరికన్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. 48 రాష్ట్రాల ప్రజలు మంచు తుఫాన్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.