పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం జరిగింది. ఆగంతకులు జరిపిన కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ గాయపడ్డాడు. ఇమ్రాన్ కాలికి తుపాకీ తూటా తగులాగా అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక కాల్పుల్లో మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వాళ్ళను కూడా ఆసుపత్రికి తరలించారు.
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ వజీరాబాద్ ” నిజమైన ఫ్రీడమ్ ” ర్యాలీ నిర్వహించారు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్. ఈ ర్యాలీ కొనసాగుతుండగా హఠాత్తుగా కొంతమంది దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఆ కాల్పుల్లో ఇమ్రాన్ కాలికి గాయమైంది. దాంతో హుటాహుటిన ఇమ్రాన్ ను ఆసుపత్రికి తరలించారు. ఇమ్రాన్ పై కాల్పులు జరగడంతో పాకిస్థాన్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.