న్యూజిలాండ్ లో 16 ఏళ్లకే ఓటు హక్కు కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం 18 సంవత్సరాల వయసున్న వాళ్లకు మాత్రమే ఓటు హక్కు ఉంది. అయితే ఇటీవల న్యూజిలాండ్ సుప్రీం కోర్టు 18 ఏళ్ల నుండి 16 ఏళ్ల వయసుకు తగ్గించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తీర్పు వెలువరించడంతో పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెడతామని స్పష్టం చేసింది ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్నెర్డ్.
అయితే బిల్లు ప్రవేశపెడతారు కానీ పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందాలంటే ఈ బిల్లుకు 75 శాతం మంది సభ్యులు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. దాంతో న్యూజిలాండ్ లో 16 ఏళ్లకే ఓటు హక్కు ఇప్పట్లో కష్టసాధ్యమే అని తెలుస్తోంది.