India Independence Day: నేడు ప్రపంచం మొత్తం భారతీయులతో నిండిపోయింది. ఏ దేశం వెళ్లినా అక్కడ ఏదో ఒక మూలన భారతీయులు ఉంటున్నారు. వారికి ఒక ప్రత్యేక సమాజం, అసోసియేషన్లు వెలుస్తున్నాయి. వీటి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తూ భారతీయుల సంఘటితాన్ని దేశ విదేశాలకు చాటుతున్నారు. భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా వైభవంగా కొనసాగాయి. ఈ వేడులను ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఆయా అసోసియేషన్లు, సంఘాలు, వ్యక్తిగతంగా కూడా నిర్వహించారు.
భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను న్యూజెర్సీలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో యూ బ్లడ్ ఫౌండర్ డాక్టర్ జై, జగదీష్ యలమంచిలి గారు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయ్యిందని. ఇన్నేళ్లలో దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలిచిందని జై గారు అన్నారు. నేడు దేశం మధ్యవర్తిత్వం లేనిది ప్రపంచంలో ఏ సమస్య పరిష్కారం కాదని, అంతగా దేశం ఎదిగిందన్నారు. ప్రపంచంలో ఐదో ఆర్థిక వనరుగా ఎదిగిన భారత్.. మరింత వేగంగా మూడో ఆర్థిక వనరుగా ఎదగడం ఖాయంగా కనిపిస్తుందిన్నారు.
న్యూజెర్సీలో జరిగిన వేడుకల్లో జైగారితో పాటు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సంబురాల్లో సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కళాకారుల నృత్యాలు, ఆట పాటలతో ప్రదేశం ఆసాంతం ఆనందంగా కనిపించింది. వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు దేశ గొప్పతనాన్ని, ఔనత్యాన్ని చాటారు.