
బ్రిటన్ వాసులకు భారత్ గుడ్ న్యూస్ తెలిపింది. బ్రిటన్ నుండి భారత్ రావాలనుకునే పర్యాటకులకు వీసాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఎలక్ట్రానిక్ వీసాలను తక్షణమే అమల్లోకి తీసుకొచ్చింది. కరోనా సమయంలో వీసాల విషయంలో పలు దేశాలు ఆంక్షలు విధించాయి. అయితే కరోనా కట్టడి తర్వాత ఇప్పుడిప్పుడే పర్యాటక రంగం మళ్లీ కోలుకుంటోంది. దాంతో వీసాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలక్ట్రానిక్ వీసాలను మంజూరు చేస్తోంది భారత్.