చైనాకు షాక్ ఇచ్చింది భారత్. కరోనా కష్టకాలంలో చైనా నుండి భారత్ వచ్చారు భారతీయ స్టూడెంట్స్. 2020 కి ముందు భారతీయ స్టూడెంట్స్ 22 వేల మందికి పైగా చైనాలో ఉన్నత విద్య నభ్యసిస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి వల్ల చైనాలో చదువుకుంటున్న భారతీయ స్టూడెంట్స్ ఇండియాకు తిరిగి వచ్చారు.
ఇక అప్పటి నుండి చైనాకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇండియన్ స్టూడెంట్స్. కానీ చైనా మాత్రం భారతీయ స్టూడెంట్స్ కు వీసా ఇవ్వడానికి నిరాకరిస్తోంది. దాంతో ప్రభుత్వం జోక్యం చేసుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన భారత్ చైనా వాసులకు వీసాలను నిరాకరించింది. టూరిస్ట్ వీసాలతో భారత్ లో పర్యటించాలని చూస్తున్న చైనా వాసులకు ఝలక్ ఇచ్చింది భారత్. పైగా ఇప్పుడు చైనాలో కరోనా ఫోర్త్ వేవ్ మొదలైంది దాంతో చైనా వాళ్లకు వీసాలను ఇవ్వడానికి నిరాకరిస్తోంది భారత్.