లండన్ లో మేయర్ గా ఎన్నికై రికార్డ్ సృష్టించింది భారతీయ దళిత మహిళ. భారత సంతతికి చెందిన మొహిందర్ కె. మిధా యూకే లో ప్రతిపక్షమైన లేబర్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే మొహిందర్ కు కౌన్సిలర్ గా అవకాశం లభించింది. కౌన్సిలర్ గా ఎన్నికైన మొహిందర్ కు మరో అదృష్టం కలిసి వచ్చింది. లండన్ లోని ఈలింగ్ కౌన్సిల్ మేయర్ గా గోల్డెన్ ఛాన్స్ దక్కింది.
దాంతో మేయర్ గా ఎన్నికైన తొలి దళిత మహిళగా మొహిందర్ కె. మిధా చరిత్ర సృష్టించింది. 2022- 2023 సంవత్సరానికి గాను మేయర్ గా మొహిందర్ ఎన్నికయ్యింది. దాంతో యూకే లో ఉన్న దళితులు , అలాగే పలువురు భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.