అమెరికా తాజాగా టాప్ 20 డైనమిక్ సీఈఓ ల జాబితా విడుదల చేసింది. కాగా ఆ జాబితాలో భారతీయుడికి చోటు దక్కడం విశేషం. ఇక ఆ భారతీయుడు ఎవరో కాదు అనిల్ గ్రంధి. ఆంధ్రప్రదేశ్ లోని రాజాం అనిల్ గ్రంధి స్వస్థలం. గ్రంధి వీరభద్ర రావు – ధనలక్ష్మీ ల వారసుడు ఈ అనిల్ గ్రంధి. డిగ్రీ వరకు రాజాం లోనే విద్యనభ్యసించిన అనిల్ ఆ తర్వాత అమెరికా పయనమయ్యాడు.
అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసి ఏజీ ఫిన్ ట్యాక్స్ అనే సంస్థని స్థాపించాడు. ఇక ఈ సంస్థకు సీఈఓ గా పనిచేస్తున్నాడు. ఈ సంస్థ పలు కార్పొరేట్ సంస్థలకు పన్నులకు సంబందించిన విషయాలలో సేవలు అందిస్తోంది. తక్కువ సమయంలోనే ఉన్నత లక్ష్యాలను చేరుకున్న ఈ సంస్థకు మంచి పేరు వచ్చింది. దాంతో అమెరికా టాప్ 20 డైనమిక్ సీఈఓ ల జాబితాలో అనిల్ గ్రంధి కి చోటు లభించింది. దాంతో పలువురు భారతీయులు అనిల్ కు శుభాకాంక్షలు అందజేస్తున్నారు.