బ్రిటన్ లో సత్తా చాటారు మన భారతీయుడు సునీల్ చోప్రా. లండన్ బరో ఆఫ్ సౌత్ వార్క్ కు ఇటీవల ఎన్నికలు జరుగగా ఆ ఎన్నికల్లో మేయర్ గా గెలిచి సత్తా చాటారు సునీల్ చోప్రా. 2013- 2014 లో సౌత్ వార్క్ డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు నిర్వర్తించిన సునీల్ 2014 – 2015 లో మేయర్ గా పదోన్నతి పొందారు. మంచి పరిపాలన అందించి ప్రజల ప్రశంసలు అందుకున్నారు.
కట్ చేస్తే లండన్ బరో ఆఫ్ సౌత్ వార్క్ కు మళ్ళీ ఎన్నికలు జరుగగా ఆ ఎన్నికల్లో నిలిచి గెలిచారు. తిరిగి రెండోసారి విజయం సాధించి సత్తా చాటారు సునీల్ చోప్రా. భారత్ కు చెందిన వ్యాపారవేత్త అయిన సునీల్ బ్రిటన్ లో స్థిరపడ్డారు. ఇండియాలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ తరుపున క్రియాశీలకంగా వ్యవహరించారు సునీల్ చోప్రా. ఇక్కడి రాజకీయ అనుభవం బ్రిటన్ లో బాగా ఉపయోగపడింది దాంతో అక్కడ మేయర్ గా గెలిచారు.